ధర్మపురి మండలం బూరుగుపల్లె లో జోరందుకున్న అక్రమ ఇసుక వ్యాపారం పట్టించుకోని అధికారులు

సాక్షి డిజిటల్ మే 18 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ : దర్మపురి: అక్రమ ఇసుక వ్యాపారం మండలంలో జోరందుకుంది. ప్రభుత్వం నుంచి అనుమతులు లేకుండా అధికారుల అండదండలతో రాత్రి, పగలు అనే తేడా లేకుండా గోదావరి నుండి యథేచ్ఛగా ఇసుకను తోడేస్తున్నారు. ఇసుక దళారులు అధికారుల సహకారం, రాజకీయ పలుకుబడితో నిర్వహిస్తున్నారు. దీనిపై పోలీస్, మండల అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. ఇసుకను కుప్పలు పోసి సాయంత్రం, ఉదయం, రాత్రి వేళల్లో గ్రామాలకు ట్రాక్టర్లు టిప్పర్ల ద్వారా తరలిస్తున్నారు. ముఖ్యంగా మండలంలో బూర్గుపల్లి, దర్మపురి, దమ్మన్నపెట్, రాజారం ఆరేపల్లి గోదావరి నది నుంచి అక్రమంగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి.సీజ్ చేసినా ఆగని వ్యాపారంగత వారం రోజుల క్రితం పోలీసులు అక్రమ ఇసుక డంపులను పట్టుకొని కేసులు పెట్టి సీజ్ చేసామని తెలిపారు. అయినా మళ్లీ అక్రమంగా ఇసుకను యథావిధిగా తరలిస్తున్నారు. కానీ ధర్మపురి లో అదికారులు పట్టుకోవడం, వదలడం షరా మామూలైంది.గత నెల పదిహేను రోజుల నుంచి అక్రమ ఇసుక జోరుగా సాగుతుంది. మండలంలో నెల నుంచి యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా జరుగుతుందని, బోర్లలో, బావులలో నీళ్లు అడుగంటుతున్నాయని అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు