గురుకుల విద్యార్థులు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాధాన్యత. డాక్టర్ షణ్ముఖ.

June 21, 2026 | తెలంగాణ

సాక్షి డిజిటల్ న్యూస్ :21 జూన్ 2026 తంబళ్లపల్లి నియోజకవర్గం ఇంచార్జ్ రమేష్ బాబు ( రాము) అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గంలో గురుకులంలోని విద్యార్థులు వ్యక్తిగత పారిశుద్ధ్యం పాటించి వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కోసువారిపల్లి పీహెచ్సీ డాక్టర్ షణ్ముఖ సూచించారు. శనివారం ఎస్టి గురుకులంలో వైద్య శిబిరం నిర్వహించి విద్యార్థులకు హిమ గ్లోబిన్ తో పాటు పలు రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పారిశుధ్యం తో పాటు తరగతి గదులు, పాఠశాల ఆవరణం పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తాగునీరు కాచి వడబోసి తాగాలని తరచూ ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. దగ్గు, జలుబు లకు మందులు పంపిణీ చేశారు. ఈ వైద్య శిబిరంలో గురుకుల ప్రిన్సిపాల్ వెంకటరమణ నాయక్, హెల్త్ అసిస్టెంట్ కృష్ణనాయక్, వైద్య, గురుకుల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper