కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఎన్నికల వాగ్దానాలు అబద్దలా ఆనవాళ్ళు
అమానుల్లా వైస్సార్సీపీ నాయకులు హిందూపూర్. మాట్లాడుతూ * కూటమి ప్రభుత్వం గత ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కేవలం తన అనుచరుల అభ్యున్నతి కోసం రాష్ట్రాన్ని దోచుకోవడం రాష్ట్ర ప్రజలకు తీరని ద్రోహం సంపద సృష్టిస్తా అంటూ రాష్ట్ర సంపదను హరించే చర్యలను ఖండిస్తున్నాను ఎన్నికల హామీల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు పెంచబోము అన్న చంద్రబాబు గెలిచిన నాలుగు నెలల్లోనే దాదాపు 50% విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలకు దోపిడీ చేయడం చాలా అన్యాయం రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా కింద 53.58 లక్షల మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం 46.85 లక్షల మందికి ఇచ్చి 6.73 లక్షల రైతులకు ఇవ్వకపోవడం అన్యాయం.వృద్ధాప్య పెన్షన్ జగన్మోహన్ రెడ్డి గారి 66 లక్షల ముప్పై నాలుగు వేల మందికి ఇస్తే కూటమి ప్రభుత్వం 65 లక్షల 27 వేల మందికి ఇచ్చి మిగతా 67 వేల మందికి పెన్షన్లు కోత విధించడం చాలా దుర్మార్గం. రెండు సంవత్సరాల కాలంలో కొత్తగా పెన్షన్లు ఇవ్వకపోగా చనిపోయిన వారి స్థానంలో కూడా కొత్త పెన్షన్లు ఇవ్వకుండా వృద్ధులకు తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది.రాష్ట్రంలో అవినీతి కరాళ నృత్యం చేస్తూ కోట్లాది రూపాయలు దోచేస్తున్నా కట్టడి చేయకపోగా నీకింత,, నాకింత,, అనే విదంగా దోపిడీ చేస్తున్నారు.మట్టి, ఇసుక తోడేస్తూ అడవులు అందిన కాటికి అమ్ముకుంటున్నారు.రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్లు కాలేజీల ఫీజులైతే ఇష్టానుసారంగా పెంచి పిల్లలు చదువుకోడానికి వీలు లేకుండా చేస్తున్నా కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు, పట్టనట్లు ఉండడం విచారకరం.గ్యాస్, డీజిల్, పెట్రోల్, ధరలు దేశంలోనే అధిక మొత్తంలో మన రాష్ట్రంలో రేట్లు పెంచడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య,రాష్ట్రంలో మైనార్టీల మీద దళితుల మీద అనుగారిన వర్గాల మీద దాడులు జరుగుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా వాళ్ల మీదే కేసులు పెట్టడం అనేది చంద్రబాబు గారి అసమర్థపాలనకు నిదర్శనం.రాష్ట్రంలో చేయడానికి పనులు లేక తినడానికి తిండి లేక, కట్టుకోవడానికి బట్టలేక, ప్రజలు దుర్భర దారిద్ర పరిస్థితి ఎదుర్కొంటున్న సమయంలో, మంచి ఆహారం తినండి,యోగా చేయండి,అని చెప్పడం హాస్యాస్పదం.
కూటమి ప్రభుత్వం పరిపాలన మీద దృష్టి సారించి సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాను.S అమానుల్లా. వైస్సార్సీపీ నాయకులు హిందూపూర్