నేరాల ఛేదనలో పోలీస్ జాగిలాల సేవలు కీలకం: జగిత్యాల జిల్లా ఎస్పి అశోక్ కుమార్ ఐపిఎస్

-ఐఐటీఏ మొయినాబాద్‌లో శిక్షణ పూర్తి చేసుకున్న నూతన జాగిలం రాఖీ

సాక్షి ఫిబ్రవరి 19 ధర్మపురి నియోజకవర్గ రిపోర్టార్ అజయ్ :

జిల్లా పోలీస్ విభాగానికి చెందిన ‘రాఖీ’ అనే నూతన పోలీస్ జాగిలం (ఐఐటీఏ), మొయినాబాద్‌ లో 8 నెలల శిక్షణ ను విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకొని జిల్లా కి వచ్చిన సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్ ఐపీఎస్ గారిని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన డాగ్ హ్యాండ్లర్ రమేష్ కి ఎస్పి గారు సర్టిఫికెట్ అందజేసి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, నేరాల ఛేదనలో పోలీస్ జాగిలాల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. పేలుడు పదార్థాల గుర్తింపు, మాదకద్రవ్యాల స్వాధీనం, నిందితుల గాలింపు, తప్పిపోయిన వ్యక్తుల ఆచూకీ గుర్తించడం వంటి కీలక సందర్భాల్లో జాగిలాల సేవలు అమూల్యమని తెలిపారు. ఆధునిక కాలంలో నేరస్తులు కొత్త పద్ధతులు అవలంబిస్తున్న నేపథ్యంలో శిక్షణ పొందిన జాగిలాలు పోలీస్ విభాగానికి బలమైన ఆధారంగా నిలుస్తాయని అన్నారు.కఠినమైన శిక్షణతో మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారైన రాఖీ జాగిలo జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో మరింత సమర్థంగా సేవలందిస్తుందని అన్నారు. జాగిలాలను నిర్వహించే సిబ్బంది మరింత అంకితభావంతో విధులు నిర్వర్తించాలని సూచించారు.ఈ యొక్క కార్యక్రమం లో రిజర్వ్ ఇన్స్పెక్టర్ సైదులు, హెడ్ కానిస్టేబుల్ కూర్మ రావు, కానిస్టేబుల్లు రమేష్, నాంపల్లి పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *