కలలు కనమన్న మహానీయుడికి, కోట్ల హృదయాల నివాళి

July 27, 2026 | సినిమా వార్తలు

డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అమానుల్లా.వైస్సార్సీపీ స్టేట్ మైనారిటీ వింగ్ కార్యదర్శి”పేదరికం ఆయనను ఆపలేకపోయింది.పరిస్థితులు ఆయనను ఓడించలేకపోయాయి.కలలు ఆయనను నడిపించాయిఆ కలలే భారతదేశాన్ని ప్రపంచం గర్వించే స్థాయికి చేర్చాయి.భారతరత్న, మాజీ రాష్ట్రపతి, ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్త, “ప్రజల రాష్ట్రపతి” డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారి 11వ వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నత వ్యక్తిత్వానికి నా హృదయపూర్వక ఘన నివాళులు.కలాం జీవితం… ప్రతి భారతీయుడికి ఒక పాఠం పేదింటి బాలుడు… దేశ గర్వంగా ఎదిగాడు. పత్రికలు పంచిన చేతులే… భారత భవిష్యత్తును తీర్చిదిద్దే క్షిపణులను రూపొందించాయి. విఫలాలను విజయానికి మెట్లుగా మార్చి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా చరిత్రలో నిలిచారు.🇮🇳 అధికారాన్ని కాదు, ప్రజల ప్రేమను గెలిచి,ప్రజల రాష్ట్రపతిగా చిరస్థాయిగా నిలిచి పోయారు.ప్రతి విద్యార్థిలో ఒక శాస్త్రవేత్తను… ప్రతి యువకుడిలో ఒక నాయకుడిని చూసిన మహోన్నత దార్శనికుడు. డాక్టర్ కలాం చెప్పిన జీవిత సత్యాలుకలలు కనండి… ఆ కలల కోసం నిద్రను కూడా త్యాగం చేయండి.విఫలం అంటే అంతం కాదు… మరో విజయానికి ఆరంభం.జ్ఞానం సంపాదించండి… ఎందుకంటే జ్ఞానమే నిజమైన శక్తి.దేశం మీ కోసం ఏం చేస్తుందో కాదు… మీరు దేశం కోసం ఏం చేస్తారో ఆలోచించండి. యువత మారితే… భారతదేశ భవిష్యత్తు మారుతుంది.డాక్టర్ కలాంకు నిజమైన నివాళి ఏమిటి? ఒక చెట్టును నాటుదాం…ఒక విద్యార్థికి చేయూత నిద్దాం.. ఒక మనిషికి సాయం చేద్దాం…🇮🇳 దేశాన్ని ప్రేమిద్దాం…నిజాయితీతో జీవిద్దాం.అదే డాక్టర్ కలాం గారికి మనం అర్పించే గొప్ప నివాళి.కలాం కలలు… భారత భవిష్యత్తు!యువత మేల్కొంటే… దేశం వెలుగొందుతుంది!కలాం చెప్పింది ఒక్కటే. కలలు కనండి, దేశాన్ని నిర్మించండి!పదవులు కాదు, విలువలే మనిషిని చిరంజీవిని చేస్తాయి!కలాం అడుగు జాడల్లో నడుద్దాం… అభివృద్ధి భారతాన్ని నిర్మిద్దాం!విజ్ఞానం మన ఆయుధం… దేశాభివృద్ధి మన లక్ష్యం!”శరీరం భూమిని విడిచి పోయినాఆలోచనలు ఆకాశంలా విస్తరిస్తాయి.మహానుభావులు మరణించరు.వారి ఆశయాలు తర తరాలకు మార్గ దర్శకంగా నిలుస్తాయి. జోహార్ డాక్టర్ ఏ.పి.జె. అబ్దుల్ కలాం గారు!మీ జీవితం ఒక పుస్తకం కాదు, ఒక విశ్వవిద్యాలయం. మీ ఆశయాలు ఒక సందేశం కాదు, భారత యువతకు శాశ్వతమీ కలలను నిజం చేయడం… ప్రతి భారతీయుడి పవిత్ర బాధ్యత.కలం పట్టిన చేతిలో, దేశం చూన భవిష్యత్తు,కలం చెప్పిన మాటలో, యువత విన్న విజయం.రెక్కలు లేని కలలకు, రెక్కలు తొడిగిన మహనీయుడు.పేదింటి గడప దాటి, భారత గర్వంగా వెలిగిన మహోన్నతుడు.పుస్తకమే పూజగా, విద్యనే వెలుగుగా,విజ్ఞానమే ఆయుధంగా, దేశసేవే ధ్యేయంగా.కలాం శరీరం దూరమైనా,కలాం కలలు ఎన్నటికీ దూరం కావు.ప్రతి విద్యార్థి విజయమే…ఆ మహనీయునికి మనం అర్పించే నిజమైనవినమ్ర నివాళి అమానుల్లా వైస్సార్సీపీ స్టేట్ మైనారిటీ వింగ్ కార్యదర్శి

🌐 Select Language:
📰 ePaper