October 4, 2026
Breaking News

సినిమా వార్తలు

భారత మాజీ ప్రధానమంత్రి భారత రత్న శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను

భారత మాజీ ప్రధానమంత్రి భారత రత్న శ్రీ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను

21వ శతాబ్దపు భారతదేశం కోసం కలలు కన్న నాయకుడు రాజీవ్ గాంధీ. రాజకీయ ప్రస్థానం1981లో అమేథీ లోక్‌సభ ఉపఎన్నిక లో విజయం సాధించి పార్లమెంటులోకి వచ్చారు.1983లో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు.ఇందిరా గాంధీ హత్య అనంతరం దేశ ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించారుకేవలం 40 ఏళ్ల వయసులో భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, అప్పటి వరకు దేశంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రధానమంత్రిగా నిలిచారు. 1984–1989 వరకు భారత ప్రధానమంత్రిగా దేశానికి సేవలందించారు.1985 నుంచి కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వహించారుభారతదేశం భవిష్యత్తు కంప్యూటర్లు, సమాచార సాంకేతికత, ఆధునిక విజ్ఞాన శాస్త్రంలో ఉందని గుర్తించి ఐటీ రంగానికి ప్రోత్సాహం ఇచ్చారు.గ్రామీణ ప్రాంతాలకూ టెలిఫోన్ సేవలు విస్తరించేందుకు చర్యలు తీసుకున్నారు. టెలికాం రంగంలో ఆధునీకరణకు బలమైన పునాది వేశారు.సాంకేతికతను వ్యవసాయం, విద్య, కమ్యూనికేషన్, పరిశ్రమలు, ప్రభుత్వ సేవల్లో వినియోగించాలనే దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్లారు.విద్యా రంగాన్ని ఆధునీకరించేందుకు నేషనల్ పాలసీ ఆన్ ఎడ్యుకేషన్ , 1986లో ముందుకు తీసుకువచ్చారు.గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలనే లక్ష్యంతో జవహర్ నవోదయ విద్యాలయం వ్యవస్థకు పునాది వేశారు.అక్షరాస్యతకు ప్రాధాన్యంకోసంనేషనల్ లీటరసీ మిషన్ ద్వారా వయోజన అక్షరాస్యతను విస్తరించేందుకు చర్యలు చేపట్టారు.రాజ్యాంగ సవరణ ద్వారా ఓటు హక్కు వయసును 21 నుంచి 18 సంవత్సరాలకు తగ్గించే ప్రక్రియకు రాజీవ్ గాంధీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.గ్రామస్థాయిలో ప్రజలకు మరింత అధికారాన్ని అందించేందుకు పంచాయతీ రాజ్ సంస్థలకు రాజ్యాంగ హోదా కల్పించే ప్రయత్నం చేశారు. ఆయన ప్రతిపాదించిన 64వ రాజ్యాంగ సవరణ బిల్లు 1989లో లోక్‌సభలో ప్రవేశపెట్టబడింది,52వ రాజ్యాంగ సవరణ 1985 ద్వారా యాంటీ డిఫెక్షన్ లా తీసుకురావడం ద్వారా రాజకీయ నాయకుల పార్టీ మార్పిడులను నియంత్రించే ప్రయత్నం చేశారు.శాంతి జాతీయ సమైక్యత కోసం
అస్సాం ఒప్పందం, మిజోరం ఒప్పందం వంటి రాజకీయ పరిష్కారాల ద్వారా ప్రాంతీయ సమస్యలకు శాంతియుత పరిష్కారాలు కనుగొనే ప్రయత్నం చేశారు.భారతదేశాన్ని 21వ శతాబ్దపు ఆధునిక దేశంగా తీర్చిదిద్దాలని కలలు కన్న యువ నాయకుడు.కంప్యూటర్ టెలికాం విద్య సాంకేతికతను జోడించి ప్రజాస్వామ్య వికేంద్రీకరణ అక్షరాస్యత పర్యావరణ పరిరక్షణ
వంటి అనేక రంగాల్లో ఆయన వేసిన అడుగులు తరువాతి దశాబ్దాల్లో భారతదేశ అభివృద్ధికి ప్రభావం చూపాయి.21 మే 1991న శ్రీపెరంబుదూరులో మానవ బాంబు దాడిలో రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు.దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం, ఆధునిక భారతదేశం కోసం ఆయన చేసిన సేవలు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి.జైహింద్.అమానుల్లా సామాజిక కార్యకర్త హిందూపూర్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📰 ePaper