September 25, 2026
Breaking News

తెలంగాణ

అసాంఘిక కార్యక్రమాల నివారణకు సహకరించండి. ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి

అసాంఘిక కార్యక్రమాల నివారణకు సహకరించండి.         ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి

సాక్షి డిజిటల్ న్యూస్ :10 ఆగస్టు 2026 తంబళ్లపల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ రమేష్ బాబు( రాము) అన్నమయ్య జిల్లా తంబాలపల్లి నియోజకవర్గం ములకలచెరువు మండల మారుమూల గ్రామాలలో జరిగే అసాంఘిక కార్యక్రమాల నివారణకు ప్రజలు సహకరించాలని ఎస్సై ఉమామహేశ్వర్ రెడ్డి సూచించారు. ఆదివారం మండలంలోని సోంపల్లిలో ఎస్సై ప్రజలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలు గ్రామాలలో జూదం, కోడిపందాలు, గంజాయి అమ్మకాల నిర్వహణ పై సమాచారం ఇవ్వాలని, సైబర్ నేరాల పై అప్రమత్తంగా ఉండాలని, మహిళలపై అఘాయిత్యాల వై అప్రమత్తంగా ఉండాలన్నారు. రోడ్డు ప్రమాదాలపై అవగాహన కలిగి హెల్మెట్ ధరించడంతో పాటు మద్యం సేవించి వాహనాలు నడపరాదని, మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని సూచించారు. గ్రామాలలో వ్యాపారాలు పేరుతో సంచరించే కొత్త వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని వెంటనే సమాచారం ఇవ్వాలని, ఇండ్ల తాళాలను జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచనలు చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📰 ePaper