రహదారి పై నిలిచిన నీటి కుంటలతో ప్రజలకు ప్రమాదం

August 9, 2026 | తెలంగాణ

రహదారి నీటికుంటలో కుర్చోని నిరసన తెలిపిన 46, 47వ వార్డు కౌన్సిలర్లు …

సాక్షి డిజిటల్ న్యూస్, కామారెడ్డి జిల్లా, ఆగస్టు 8, (తెలంగాణ స్టేట్ బ్యూరో ఇన్చార్జి కే.కరుణాకర్) :అధికారులకు ఎన్నిసార్లు నీటి కుంటలపై ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో అధికారులకు అర్థమయ్యేలా వినూత్నంగా రహదారి పై నిలిచిన నీటికుంటలో కుర్చోని నిరసన తెలిపిన 46, 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మినారాయణలు. ఈ సందర్భంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని రాత్రి కురిసిన వర్షానికి జిల్లా కామారెడ్డి నుండి కరీంనగర్ జాతీయ రహదారి అయిన స్టేషన్ రోడ్డులోని పోలీస్ స్టేషన్ ముందు వరద నీరు ఎటు వైపు కుడా వెళ్లకుండా ఒక ప్రదాన రహదారి ఒక కుంటను, ఒక చెరువును తలపిస్తు రహదారి వెళ్లే వాహనదారులు, పాదచారులకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ వరద నీటికుంట వల్లన ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ నీటికుంటతో ట్రాఫిక్ జామ్ అయి వాహనదారులు తీవ్ర స్థాయిలో ఇబ్బందులకు గురవు తున్నారు. అతి సమీపంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఇదే దారిలో ఉంది రోగులు, క్షతగాత్రులు ఎమర్జెన్సీ సమయంలో 108 వాహనాలకు మరియు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విలువైన ప్రాణాలు సైతం గాల్లో కలిసిపోతున్నాయని తెలియజేశారు. కామారెడ్డి టు కరీంనగర్ ప్రదాన రహదారి ఇది ఒక్కటే కావున సమస్యను తోందరగా యుద్ధప్రాతిపదికన పరిష్కరించడానికి అదికారులు చర్యలు తీసుకోవాలి. అధికారులు ఈ సమస్యను పరిష్కరించకుంటే ఇక్కడే నీటి కుంటలో దీక్ష చేపడతానని 46, 47వ వార్డు కౌన్సిలర్లు గెరిగంటి స్వప్న, లక్ష్మినారాయణలు తెలిపారు. ఇకనైనా అధికారుల స్పందిస్తారో ? లేదో ? వేచి చూడాలి.

🌐 Select Language:
📰 ePaper