ఎండ తీవ్రతలో డెలివరీ సిబ్బందికి అండగా నిలుద్దాం

May 23, 2026 | తెలంగాణ

డాక్టర్ దివ్య చందన విజ్ఞప్తి

సాక్షి డిజిటల్ న్యూస్:తేదీ (23 మే), హైదరాబాద్, లింగంపల్లి ,రమేష్ . పెరుగుతున్న ఎండ తీవ్రత నేపథ్యంలో ప్రజలకు ప్రముఖ సామాజిక సేవకురాలు రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) జాతీయ మహిళా విభాగ ఉపాధ్యక్షురాలు, వావ్‌మామ్ సేవా ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ దివ్య చందన వినయపూర్వక విజ్ఞప్తి చేశారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరం కాకపోతే ఆన్‌లైన్ ఆహారం లేదా నిత్యావసర వస్తువుల ఆర్డర్లు ఇవ్వకుండా ఉండాలని ఆమె కోరారు. “తీవ్ర ఎండలో డెలివరీ సిబ్బంది తమ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ప్రజలకు సేవలు అందిస్తున్నారు. వారు కూడా మనుషులే. మన చిన్న సహనం, మానవత్వం వారికి పెద్ద ఉపశమనంగా మారుతుంది” అని ఆమె తెలిపారు.

🌐 Select Language:
📰 ePaper