ఈరోజు హిందూపురంలోదస్తాలేఖరు ల డిమాండ్ల పరిష్కారం కొరకు వారు చేస్తున్న శిబిరం వద్దకు కాంగ్రెస్ పార్టీ నాయకులైన జమీల్ గారి ఆధ్వర్యంలో కలసి వారి మీద దుర్మార్గంగా ప్రవేశపెట్టిన 396 జీవోను వెంటనే రద్దు చేయాలని, వారికీ సంగీభావం తెలిపారు.

July 24, 2026 | సినిమా వార్తలు

ఎన్నోఏళ్లుగా డాక్యుమెంట్ లేఖరులుగా పనిచేస్తూ పొట్ట పోసుకుంటున్న పేదలకు పొట్ట కొట్టే దుర్మార్గమైన చట్టాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది.వీరికి ప్రభుత్వం నుండి జీతం లేదు, ఇన్సెంటివ్లు లేవు, ఈ ఎస్ ఐ లేదు, ఉద్యోగ భద్రత లేదు, పి ఎఫ్ లేదు ఐన ప్రభుత్వానికి వీరి మీదఎందుకు ద్వేషం.వీరిని నిషేధించే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? కేవలం సాంకేతికతను పెంచే నెపంతో తమ అనుచరులకు మైంటెనెన్సు కాంట్రాక్టులను ఇవ్వాలనే తపన తప్ప ప్రజలకు సులభతరమైన సేవ చేయాలనీ లేదు. నిజంగా ఉద్యోగాలు ఇచ్చేమనసే ఉంటే వాలంటీర్లను ఎందుకు తొలగించారు పీపీపీ విధానం రాష్ట్ర ప్రయోజనాలకు అభివృద్ధికి ఆటంకం అవుతుంది కానీ ప్రయోజనం సూన్యం. ఇప్పటికైనా సీఎం గారు పునరాలోచించి 396 GO ను రద్దుచ్చేసి దస్తావేజు లేకరులకు న్యాయం చేయాలనీ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ తరఫున సబ్ రిజిస్ట్రార్ గారిని కలసి వినతి పత్రం అందించారు.భవిష్యత్లో మీరు డిమాండ్ల పరిష్కారం కోసం ఎల్లవేళలా వెన్నంటి ఉంటామని హామీ ఇవ్వడమైనది.ఈ కార్యక్రమంలో,కాంగ్రెస్ నాయకులు యూనస్, అమానుల్లా రవుఫ్ సాబ్ పీరుసాబ్ తిరుపాల్ ముబారక్ కోటిపన్న నాగిరెడ్డి సంజీవప్ప,డాక్యూమెంట్ రైటర్ల నాయకులు హరీష్, లక్ష్మీనారాయణ,అతవుల్లా బాలాజీ, జయరాం,మొదలగువారు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper