మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి పై వంతెన నిర్మించాలని బిజెపి పోరుబాట

సాక్షి డిజిటల్ న్యూస్ ఏప్రిల్ 13,2026 మంచిర్యాల జిల్లా బ్యూరో ఇంచార్జ్ రావుల రాంమోహన్…

మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి పై వంతెన నిర్మించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మంచిర్యాల ఐబీ చౌరస్తా వద్ద చేపట్టిన గోదావరి వంతెన పోరు కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి మరియు జిల్లా అద్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ పాల్గొని పేద ప్రజలకు ఉపయోగపడే చోట మంచిర్యాల – అంతర్గాం మధ్య గోదావరి పై వంతెన నిర్మించాలని ఇక్కడ నిర్మాణం చేపట్టడం వల్ల బస్ లో వెళ్లే పేద ప్రజలకు ఒక్కొక్కరికి రోజుకు 100 రూపాయలు ఖర్చు ఆదా అవుతుందని రఘునాథ్ గారు అన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టకపోవడంతో ఒక్క ఏడాదిలో దాదాపు 80 నుండి 100 కోట్ల రూపాయలు ప్రజల పై భారం పడుతుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే, భారత రాష్ట్ర సమితి పార్టీ పది సంవత్సరాలు వంతెన నిర్మాణం చేపట్టకుండా కాలయాపన చేస్తే ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే తన స్వార్థ ప్రయోజనాల కోసం కమిషన్లకు కక్కుర్తి పడి ఇక్కడ వంతెన నిర్మించకుండా మంజూరు అయినా వంతెనను రద్దు చేయడం జరిగింది. మంచిర్యాల- అంతర్గం మధ్య వంతెన నిర్మాణం వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర నాయకులు దుర్గం అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వరరావు, మంచిర్యాల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్, కార్పొరేటర్లు నాగరాజు, నాయకులు బోట్ల సత్యనారాయణ అధిక సంఖ్య లో బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *