ఆశించిన ఫలితాలతోనే లక్ష్యాలు చేరువవుతాయి

సాక్షి డిజిటల్ న్యూస్13/04/26 రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల్ రిపోర్టర్ జి.ఎస్. కె

షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

కమ్మదనం ప్రభుత్వ గురుకుల ఇంటర్ విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే

మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులుతో కలిసి విద్యార్థులకు అభినందనలు

ఇంటర్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను సన్మానించిన ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు

కమ్మదనం గురుకుల ప్రిన్సిపల్ శారద తదితర బోధన సిబ్బందికి అభినందనలు

విద్యార్థులు ఆశించిన ఫలితాలను సాధించినప్పుడే తాము నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరువవుతాయని
తద్వారా సమాజంలో మంచి విద్యతో మంచి ఫలితాలు సాధించగలుగుతామని షాద్ నగర్ ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరుక్ నగర్ మండలం కమ్మదనం ప్రభుత్వ గురుకుల కళాశాలలో ఇంటర్ ఫలితాలలో విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. పెద్ద ఎత్తున మార్కులు సాధించడంతో వారిని అభినందించడానికి స్వయంగా ఎమ్మెల్యే శంకర్, మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు, ఇంకా పుర ప్రముఖులు నాయకులు మీడియా ప్రతినిధులు గురుకులానికి తరలి వెళ్లారు. ఈ సందర్భంగా ఎంపీసీ విభాగంలో శ్రావణి 990 మార్కులు, అఖిల 988, బైపిసి ఫస్ట్ ఇయర్ విభాగంలో లోఖిత 990, ఆశ్రిత 986, ఎంపీసీ విభాగంలో రిశ్విక 465, ఐశ్వర్య 465, శృతి 464, బైపీసీ విభాగంలో భాగ్యస్రీ 434, భవన 431, వరుని 430 మార్కులు అత్యధికంగా సాధించడంతో ఎమ్మెల్యే శంకర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు తదితరులు విద్యార్థులను శాలువాలతో స్వీట్లు తినిపించి ఘనంగా సత్కరించారు.

చేసిన మంచి పనులు ఊరికే పోవు…

చేసిన మంచి పనులు ఊరికే పోవాలి ఆనాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న సమయంలో ప్రభుత్వ గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం ఈరోజు ఎంతోమంది గురుకులం ద్వారా ఫలితాలను పొందుతూ సమాజంలో గొప్ప గౌరవ మర్యాదలతో విద్యను అభ్యసిస్తూ ప్రయోజకులు అవుతున్నారని ఇదంతా ఆనాటి ప్రభుత్వ పెద్దల మంచి పనులనీ ఎమ్మెల్యే శంకర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఇక్కడ ఏర్పాటైన కమ్మదనం గురుకుల పాఠశాల ఈరోజు ఎంతో మంది విద్యార్థులకు బతుకునిస్తుందని ఇది ఎంతో శుభ పరిణామామని అన్నారు. కమ్మదనం గురుకుల పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయిలో మార్కులు సాధించడం ఆషామాషీ విషయం కాదని ప్రైవేటు కళాశాలలకు దీటుగా ప్రభుత్వ గురుకులాలలో ఉత్తీర్ణత శాతం పెరుగుతుందని అన్నారు. కమదనం గురుకులంలో కళాశాల ఇంటర్ ఫలితాలలో మొత్తం 100% విద్యార్థులు ఉత్తీర్ణత సాధించడం అద్భుతమైన విషయం అని దీనికి సహకరించిన ప్రిన్సిపల్ శారద అదే విధంగా బోధన సిబ్బంది తదితర సిబ్బందికి ఆయన అభినందనలు తెలిపారు.

వారి చలువ వల్లే..

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చలువ వల్లే ఈ ప్రాంతంలో గురుకులాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింహులు అన్నారు. కమ్మదనం గురుకుల పాఠశాల రాష్ట్రవ్యాప్తంగా ఎల్లప్పుడూ ఫలితాలలో మంచి పేరు సంపాదిస్తుందని దీనికి కారణమైన అధ్యాపక సిబ్బంది ప్రిన్సిపల్ శారద అదే విధంగా విద్యార్థుల తల్లిదండ్రులు సహకరించిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కళాశాలలో ఎప్పుడు ఏ అవసరం ఉన్న ఎమ్మెల్యే శంకర్ అదే విధంగా తన సహకారం ఎల్లవేళలా అందిస్తామని అన్నారు. ఇంత చక్కని ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా శాలువాలు కప్పి అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ శారద మిగతా అధ్యాపకులు ఇతర సిబ్బంది అదేవిధంగా పట్టణానికి చెందిన సీనియర్ నాయకులు చెంది తిరుపతిరెడ్డి, మాజీ చైర్మన్ అన్మారి వెంకటయ్య, పార్లమెంటరీ నాయకుడు పురుషోత్తం రెడ్డి, హరినాథ్ రెడ్డి, అన్వర్, జిటి సంతోష్, తదితరులను అభినందించారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *