జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆరోగ్యవంతుడు కావాలి:

శ్రీ మరువ ఆంజనేయస్వామి దేవాలయంలో జనసేన శ్రేణులు ప్రత్యేక పూజలు

జనం న్యూస్ ఏప్రిల్ 21 (గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్)
జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకుని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా సేవలోకి రావాలని ఆకాంక్షిస్తూ శ్రీ సత్యసాయి జిల్లా, పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మండల పరిధిలోని చారిత్రాత్మకశ్రీ మరవ ఆంజనేయస్వామి దేవాలయ సన్నిధిలో జనసేన నాయకులు, కార్యకర్తలు మరియు వీర మహిళలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు.
రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న తమ నాయకుడు పవన్ కళ్యాణ్ , మరింత శక్తితో, ధైర్యంతో ప్రజాక్షేత్రంలోకి రావాలని ఈ సందర్భంగా నేతలు ఆకాంక్షించారు. మరవ కట్ట ఆంజనేయస్వామి ఆశీస్సులతో ఆయనకు ఎటువంటి ఆటంకాలు కలగకూడదని మనస్ఫూర్తిగా ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో గోరంట్ల మండలం అధ్యక్షులు సంతోష్ కుమార్, జిల్లా సంయుక్త కార్యదర్శిసి . వెంకటేష్, ఉమ్మడి అనంతపురం జిల్లా కార్యదర్శి సురేష్ కుమార్, మరియు జిల్లా కార్యక్రమాల కమిటీ సభ్యుడు పి.వెంకటేష్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
వీరితో పాటు సింగల్ విండో డైరెక్టర్ నాగేష్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నరేష్, వీర మహిళ కావేరి, గొల్ల అనిల్ యాదవ్, గాజుల రమేష్, వడిగేపల్లి శివ, చౌడేశ్వరి కాలనీ శ్రీనివాసులు, శ్రీరాములు, మందలపల్లి రామాంజి, లక్ష్మన్న, మల సముద్రం పంచాయతీ రామాంజ, బాలశెట్టి రంగప్ప, గంగంపల్లి రమణ, సాయి దర్శన్, నాగభూషణ, కమ్మలోల్లపల్లి రాజు, మహేష్, గణేష్, సుదర్శన్ మరియు ఇతర గోరంట్ల మండల జనసేన నాయకులు, కార్యకర్తలు పూజా కార్యక్రమాల్లో పాల్గొని పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కోసం ప్రార్థించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *