కాంగో, ఉగాండాలో ఈబోలా వైరస్ ఉధృతి: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి – డా. దివ్య చందన
సాక్షి డిజిటల్ న్యూస్ , తేదీ(25 మే), హైదరాబాద్, రమేష్ . ఆఫ్రికా దేశాలైన డెమోక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో మరియు ఉగాండాలో ఈబోలా వైరస్ వ్యాధి మళ్లీ వ్యాపిస్తుండటంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. ఆరోగ్య సంస్థలు, ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నాయి. ఈ నేపథ్యంలో డా. దివ్య చందన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే) జాతీయ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు, వావ్‌మామ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, మిషన్ మోదీ రాష్ట్రీయ సంఘ్ తెలంగాణ రాష్ట్ర ఆరోగ్య & పారిశుద్ధ్య విభాగం చీఫ్, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డా. దివ్య చందన మాట్లాడుతూ, “ఈబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధి. అధిక జ్వరం, బలహీనత, వాంతులు, విరేచనాలు, శరీర నొప్పులు, కొన్ని సందర్భాల్లో రక్తస్రావం వంటి లక్షణాలు కనిపించవచ్చు. వైరస్ సోకిన వ్యక్తుల శరీర ద్రవాల ద్వారా వ్యాపించే అవకాశం ఉన్నందున ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలి” అని తెలిపారు.అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వారు ఆరోగ్య సూచనలు పాటించాలని, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. కరోనా మహమ్మారి నుంచి ప్రపంచం పాఠాలు నేర్చుకున్న నేపథ్యంలో ప్రజలు భయపడకుండా అప్రమత్తంగా ఉండటం అత్యంత అవసరమని పేర్కొన్నారు.