S. అమానుల్లా మాట్లాడుతూ క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గాయి మరి ప్రజలకు రేట్లు ఎప్పుడు తగ్గిస్తారో చంద్రబాబు గారు, నరేంద్ర మోదీ గారు సమాధానం చెప్పాలి *
క్రూడ్ ఆయిల్ ధర తగ్గితే… పెట్రోల్,డీజిల్ గ్యాస్ ధరలు ఎందుకు తగ్గడం లేదు.?అంతర్జాతీయంగా ధరలు తగ్గితే…..భారత ప్రజలకు ప్రయోజనం ఎందుకు లేదు.?ధరలు పెరిగితే వెంటనే ధరలు పెంచేస్తారు మరి తగ్గితే ధర తగ్గించాలి కదా.తగ్గించాలి కదా.క్రూడ్ ఆయిల్ ధరలు యుద్ధానికి ముందున్న స్థాయికి చేరుకున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు?అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతున్నా, ఆ ప్రయోజనం దేశ ప్రజలకు ఎందుకు అందడం లేదు?ఇదే సమయంలో 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర రూ.3303 -50 కు చేరడం, అలాగే డొమెస్టిక్ LPG సిలిండర్ ధర 966-50 కూడా భారంగా ఉండటం వల్ల చిన్న వ్యాపారులు, హోటల్ నిర్వాహకులు, మధ్యతరగతి కుటుంబాలు, పేద ప్రజలపై అదనపు ఆర్థిక భారం పడుతోంది.అంతేకాకుండా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వంట నూనెల ధరలు కూడా ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం వల్ల సామాన్యుడి జీవన వ్యయం రోజురోజుకూ పెరుగుతోంది.ధరలు పెరిగినప్పుడు వెంటనే ప్రభావం చూపే ప్రభుత్వం, అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు తగ్గినప్పుడు ప్రజలకు ఎందుకు ఉపశమనం కల్పించడం లేదు?కేంద్ర ప్రభుత్వం వెంటనే ఇంధన ధరలు, LPG గ్యాస్ సిలిండర్ల ధరలు, వంట నూనెల ధరలను సమీక్షించి, ప్రజలకు ప్రత్యక్ష ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకోవాలి. పెరుగుతున్న ధరల భారంతో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు తక్షణ ఉపశమనం కల్పించడం ప్రభుత్వ బాధ్యత.ప్రజల ప్రశ్న ఒక్కటే… క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గితే, పెట్రోల్–డీజిల్ ధరలు ఎందుకు తగ్గడం లేదు? గ్యాస్ సిలిండర్, వంట నూనెల ధరలు ఎందుకు సామాన్యుడికి అందుబాటులోకి రావడం లేదు?ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమైతే, ధరల నియంత్రణపై వెంటనే చర్యలు తీసుకోవాలి. రాజశేఖరరెడ్డి గారు సీఎం గా ఉన్నపుడు గ్యాస్ సిలెండరు ధరలో 50 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ఇచ్చాడు.అదే విదంగా చంద్రబాబు గారు లీటర్ పెట్రోల్ 80-00కి , లీటర్ డిజల్ 70 రుపాయ లకు , ఇంటి గ్యాస్ 700 రూపాయలకు కమర్షియల్ సిలెండరు 2000 కు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాను.S.అమానుల్లా వైస్సార్సీపీ స్టేట్ మైనారిటీ సెక్రటరీ, హిందూపూర్