నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉండాలి —జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

July 8, 2026 | తెలంగాణ

సాక్షి డిజిటల్ న్యూస్ జులై 08మెదక్ రిపోర్టార్ పి. దుర్గేష్ గౌడ్ జిల్లాలో వ్యవసాయ కార్యకలాపాల పై కలెక్టర్ సమీక్షజిల్లాలో ఖరీఫ్ వ్యవసాయ సన్నాహాలు, రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్‌పుట్ల సరఫరా, ప్రభుత్వ రైతు సంక్షేమ పథకాల అమలుపై జిల్లా కలెక్టర్ నేడు సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ..రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు సకాలంలో అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పంటల సాగు పురోగతి, వర్షపాతం పరిస్థితులు, నీటి లభ్యత, ఎరువుల నిల్వలు, పంటలలో తెగుళ్లు, కీటకాల నివారణ చర్యలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. వ్యవసాయ అధికారులు గ్రామస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ రైతులకు శాస్త్రీయ సాగు విధానాలు, సమతుల్య ఎరువుల వినియోగం, నేల పరీక్షలు, సూక్ష్మపోషకాల వినియోగం, నీటి యాజమాన్యంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి, ప్రభుత్వ పథకాల అమలులో పారదర్శకత పాటించాలని ఆదేశించారు. వ్యవసాయ శాఖతో పాటు అనుబంధ శాఖలు సమన్వయంతో పనిచేసి రైతులకు మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు.ఈ సమావేశంలో సంయుక్త వ్యవసాయ సంచాలకులు, జిల్లా వ్యవసాయ అధికారి, వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, అనుబంధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper