దొడ్డి కొమురయ్య చిత్రపటానికి గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం నాయకుల ఘన నివాళులు..

July 5, 2026 | తెలంగాణ

సాక్షి డిజిటల్ న్యూస్ జూలై 5 మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం (రిపోర్టర్ వల్లపుదాసు వెంకటేశ్వర్లు)తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు తొలి అమరుడు దొడ్డి కొమరయ్య 80వ వర్ధంతి సందర్భంగా శనివారం గార్ల మండల కేంద్రంలోని అమర వీరుల స్థూపం వద్ద గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలో దొడ్డి కొమురయ్య చిత్రపటానికి సీనియర్ నాయకులు పల్లెబోయిన లింగయ్య పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం సంఘం బాధ్యులు మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం బానిస సంకెళ్ల నుంచి విముక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నడుంబిగించి తెలంగాణ సాయుధ పోరాటంలో వీరమరణం పొందిన తొలి అమరుడు నైజాం దేశ్ముఖ కుట్రలో భాగంగా కొమురయ్య రక్తంతో తెలంగాణ రక్తసిద్ధమైన బంచన్ దొర నీ కాల్మోకత అంటూ దొర పెత్తనంలో నలిగిన వాళ్లను బంధుకులు చేతబట్టి పోరాడే దిశగా నడిపించిన ధీరుడు దొడ్డి కొమరయ్య అని రాష్ట్ర ప్రభుత్వం వారి వర్ధంతిని అధికారికంగా జరపాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో గొర్రెల మేకల పెంపకం దార్ల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఇమ్మడి గోవిందు మండల అధ్యక్షులు వడ్డెప్పుడు మల్లయ్య సంఘం నాయకులు తోట కొండలరావు గౌని మల్లేశం ముంగి రాములు జడ చిన్న శ్రీను తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య వర్ధంతి సభలను గార్ల మండల సిపిఎం సిపిఐ పలు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నిర్వహించారు.

🌐 Select Language:
📰 ePaper