మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు అండగా వైఎస్సార్‌సీపీ శ్రేణులు

June 30, 2026 | తెలంగాణ

రేపు మహిళా కమిషన్ ముందుకు అమర్నాథ్…•

విశాఖ నుంచి భారీగా తరలనున్న అభిమానులు, కార్యకర్తలు…•

మాజీ మంత్రి కి అండగా యవరక్తం…

అమర్ మాటలు వక్రీకరించి యావత్ మహిళలకు ఆపాదించడం సరికాదు..‌.

సాక్షి డిజిటల్ న్యూస్ ఆనందపురం రిపోర్టర్ (భాగం స్వాతి సుధాకర్) జూన్ 29:వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువనేత, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్‌కు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా వ్యాప్తంగా అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. రాష్ట్ర హోం మంత్రిపై అనుచిత వ్యాఖ్యలు చేశారనే నెపంతో మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులపై స్పందిస్తూ, రేపు (మంగళవారం) ఆయన కమిషన్ ముందు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రియతమ నేతకు అండగా నిలిచేందుకు ఉమ్మడి విశాఖ జిల్లా నలుమూలల నుంచి అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు భారీ సంఖ్యలో తరలివెళ్లేందుకు సమాయత్తమవుతున్నారు.రాజకీయ కక్షసాధింపు చర్యే: వైఎస్సార్‌సీపీ నేతలుకూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్‌సీపీ సోషల్ మీడియా కార్యకర్తలను, కీలక నేతలను టార్గెట్ చేస్తూ తప్పుడు కేసులు, నోటీసులతో వేధిస్తోందని పార్టీ ముఖ్య నేతలు మండిపడుతున్నారు. ప్రజల తరఫున గళం విప్పుతున్న గుడివాడ అమర్నాథ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే, ఇలా మహిళా కమిషన్ నోటీసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ బెదిరింపులకు, తప్పుడు కేసులకు భయపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.అమర్నాథ్ వెంట నడిచేందుకు భారీగా తరలింపుగుడివాడ అమర్నాథ్‌కు మద్దతుగా ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని అనకాపల్లి, విశాఖపట్నం, భీమిలి, గాజువాక, పెందుర్తి తదితర నియోజకవర్గాల నుంచి వేలాది మంది అభిమానులు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు రేపు ఉదయాన్నే ఆయన వెంట బయలుదేరనున్నారు. తమ నేతకు సంఘీభావం తెలుపుతూ మహిళా కమిషన్ కార్యాలయం వరకు తోడుగా వెళ్లేందుకు యువత, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకున్నారు.ఎన్ని కుట్రలు చేసినా ప్రజాక్షేత్రంలో గుడివాడ అమర్నాథ్ వెంటే ఉంటామని, రేపటి సంఘీభావ యాత్ర ద్వారా వైఎస్సార్‌సీపీ శ్రేణుల బలాన్ని, ఐక్యతను చాటిచెబుతామని జిల్లా పార్టీ విభాగాలు ప్రకటించాయి.

🌐 Select Language:
📰 ePaper