కేంద్ర ప్రభుత్వం వి.బి.జి. రాంజీ చట్టాన్ని రద్దుచేసి ఉపాధి చట్టాన్ని యదావిధిగా అమలు చేయాలి.

July 2, 2026 | తెలంగాణ

అఖిల భారత రైతు కూలి సంఘం రాష్ట్ర నాయకులు జీ సక్రు డిమాండ్.వ్యవసాయ కూలీల పొట్ట కొట్టే వి.బి.జి రామ్ చట్టాన్ని ఉపసంహరించుకొని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర నాయకులు జీ సక్రు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని. గ్రామీణ ఉపాధిని నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తెచ్చిందని జీ సక్రు అన్నారు. 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచుతున్నామని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నప్పటికీ దానికి తగిన నిధులు కేటాయించకపోవడం విచారకరం. దేశవ్యాప్తంగా 765 కోట్ల మంది కార్మికులకు 125 రోజుల పని కల్పించాలంటే.రూ. 3.30 లక్షల కోట్లకు పైగా అవసరం ఉంటుంది అయితే కేంద్ర ప్రభుత్వం కేవలం 97 వేల కోట్లు రూపాయలు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుందని ఆయన అన్నారు. పెరుగుతున్న జీవన వ్యాయాలను దృష్టిలో ఉంచుకొని రోజువారి వేతనం పెంచవలసి ఉండగా ప్రభుత్వం పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసం కార్మికులు రైతుల గ్రామీణ పేదల హక్కులను హరిస్తుందని ఆయన అన్నారు. ఉపాధి హామీ చట్టాన్ని మరీ అంత బలోపేతం చేయవలసిన సమయంలో పని దినాలు కనీస వేతనాలు పెంచాలన్న కార్మిక సంఘాల డిమాండ్లను పట్టించుకోకపోవడం చట్టం పేరును మార్చి కొత్త చట్టాన్ని తీసుకురావడం వెనుక ప్రభుత్వ దురుద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన 12 ఏళ్లలో ఉపాధి హామీ చట్టాన్ని నిధులు తగ్గిస్తూ బలహీనపరిచే కుట్ర చేస్తుందని ఆయన అన్నారు. ఇప్పటివరకు కేంద్రం 90 శాతం రాష్ట్రాలు పది శాతం వ్యయంభరించే విధానాన్ని మార్చి రాష్ట్రాల వాటలు 40 శాతానికి పెంచడం వల్ల తెలంగాణ పై తీవ్రమైన ఆర్థిక భారం పడుతుంది. రాష్ట్రంలో అధికారం లో ఉన్న కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షమైన మిగతా పార్టీలు కేంద్ర విధానాలపై స్పష్టమైన వైఖరిని తీసుకొని ప్రజల పక్షాన ఉద్యమించ వలసిన అవసరం ఎంతైనా ఉంది ఉపాధి హామీ చట్టం బలహీన పడితే గ్రామాల్లోని పేదలు ఉపాధి లేక పట్టణాలకు వలస వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే పట్టణాలకు వలస వచ్చిన కార్మికులు జీవన పరిస్థితులు అత్యంత దయానికంగా ఉన్నాయి. చట్టం కార్మికుల ప్రయోజనాల కోసం కాకుండా కాంట్రాక్టర్లు ధనిక వర్గాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించి నట్లుగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి లేఖలు రాయడంతోనే సరిపోదని కొత్త చట్టానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని అప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వానికి మెడలు వంచినట్టుగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు రద్దయేంతవరకు సమిష్టిగా పోరాడవలసిన అవసరం ఉందని ఆయన కోరారు.

🌐 Select Language:
📰 ePaper