ఏఐసీసీ పీసీసీ ఆదేశాల మేరకు ఈరోజు మహానేత,పేద బడుగు బలహీన వర్గాల నాయకుడు పేద ప్రజల ఆశాజ్యోతి సంక్షేమ పథకాల ప్రధాత స్వర్గీయ డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి 77 వ జయంతి

July 8, 2026 | ఆంధ్రప్రదేశ్

సందర్భంగా హిందూపురం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హిందూపురం బస్టాండ్ లోని వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించి ఆయన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలను కొనియాడారు మంచి భావాలతోటి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతూ కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఒంటి చేత్తో అధికారంలోకి తెచ్చినటువంటి ఘనత రాజశేఖర్ రెడ్డి గారిది.ఆయన లేని లోటు పార్టీకి చాలా తీరని లోటుగా భావిస్తూ కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల కోసం ఆయన ఆశయాన్ని కొనసాగించి, కేంద్రంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా పనిచేస్తామని చెప్పారు.రాష్ట్రంలో, మరియు హిందూపురంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జమీల్ సీనియర్ నాయకులు యానుస్, రవుఫ్, మాజీ కౌన్సిలర్లు సమీవుల్లా, పీరుసాబ్ మహబూబ్ బాషా, యం ఇ సమీవుల్లా, అయాజ్, సయ్యద్ అక్రమ్, సద్రుల్లా, తిరుపాల్, బాబు, ముబారక్, కోటిపన్న దాసన్న మొదలగువారు పాల్గొన్నారు

🌐 Select Language:
📰 ePaper