మునిసిపల్ మరియు ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ఆడుకోవద్దు.

July 9, 2026 | తెలంగాణ

మున్సిపల్ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం ప్రయోగాలు ఎందుకు చేస్తోంది?జి.ఓ. నెం. 673, 975లను వెంటనే ఉపసంహరించాలి – వైస్సార్సీపీ స్టేట్ మైనారిటీ కార్యదర్శి అమానుల్లా డిమాండ్ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జి.ఓ. నెం. 673, 975ల ద్వారా మున్సిపల్ సేవలను ప్రైవేటీకరించే నిర్ణయం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది పట్టణాలను పరిశుభ్రంగా ఉంచిన మున్సిపల్ కార్మికులకు ఇదేనా మీ ప్రభుత్వం ఇచ్చే గౌరవం?దశాబ్దాలుగా సేవలందిస్తున్న కార్మికులను పక్కనబెట్టి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అప్పగించడం ఎవరికోసం,ఏ ప్రజాహితం కోసం?ఖాళీ పోస్టులను భర్తీ చేయకుండా ప్రైవేటీకరణకు ఎందుకు అంత తొందర?ప్రభుత్వ శాఖలను బలోపేతం చేయాల్సిన సమయంలో వాటిని బలహీనపరచడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటి?కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం కాదా?శాంతియుతంగా నిరసన తెలిపిన కార్మికులపై పోలీసులను ప్రయోగించడం ద్వారా ప్రభుత్వం ఏ సందేశం ఇవ్వాలనుకుంటోంది?ఉద్యోగ భద్రత, సముచిత వేతనాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా?ప్రజా సేవలను ప్రైవేటీకరించడం వల్ల నాణ్యమైన సేవలు ప్రజలకు ఎలా అందుతాయని ప్రభుత్వం హామీ ఇస్తుంది?కార్మికుల కష్టార్జిత హక్కులను కాలరాస్తే సామాన్య ప్రజలు ప్రభుత్వంపై ఎలా నమ్మకం ఉంచాలి? కార్మికుల సంక్షేమాన్ని పక్కనబెట్టి ప్రైవేటీకరణ పేరుతో వేలాది కుటుంబాలను ఆర్థిక అనిశ్చితిలోకి నెట్టడం అత్యంత బాధాకరం ప్రభుత్వం వెంటనే తన వైఖరిని మార్చుకుని పై జీఓలను ఉపసంహరించు కోవాలి. మున్సిపల్ కార్మికులతో, కార్మిక సంఘాలతో చర్చలు జరపాలి.ఖాళీ పోస్టులను శాశ్వత నియామకాలతో భర్తీ చేయాలి.కార్మికుల హక్కులు, ఉద్యోగ భద్రతకు పూర్తి హామీ ఇవ్వాలి.కార్మికుల చెమటతో నడిచే వ్యవస్థను కార్పొరేట్ లాభాలకు బలిచేయవద్దుప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజల స్వరాన్ని వినాలి. లేకపోతే కార్మికుల న్యాయమైన పోరాటానికి వైస్సార్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం అండగా నిలుస్తుంది.S.అమానుల్లా ఆంధ్రప్రదేశ్ వైస్సార్సీపీ స్టేట్ మైనారిటి కార్యదర్శి.

🌐 Select Language:
📰 ePaper