మారేడ్‌పల్లి డబుల్ బెడ్‌రూం ప్రాంగణాన్ని నెంబర్ 1 మోడల్ కాలనీగా తీర్చిదిద్దుతాం: ఎమ్మెల్యే శ్రీగణేష్

May 28, 2026 | తెలంగాణ

సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టర్ నటరాజ్ గౌడ్ మే 28. సికింద్రాబాద్ మారేడ్‌పల్లి డబుల్ బెడ్‌రూం ప్రాంగణాన్ని బుధవారం కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ మున్సిపల్, రెవెన్యూ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. ప్రాంగణం లోని ఇళ్లకు స్వయంగా వెళ్లి బస్తీ వాసులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు, అవసరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలాలలో ప్రాంగణ వాసుల కోరిక మేరకు బస్తీ దవాఖానా, కమ్యూనిటీ హాల్, మహిళా భవన్, ఓపెన్ జిమ్‌లను ఏర్పాటు చేస్తామని, నిధులకు ఎలాంటి లోటు లేదని నిధులు తెచ్చే బాధ్యత పూర్తిగా తనదేనని, అధికారులు ప్రణాళికలను పక్కాగా సిద్ధం చేయాలని ఆదేశించారు.అంతేకాకుండా, ప్రాంగణంలో తాగునీటి సరఫరా, బోర్లు, డ్రైనేజీ వ్యవస్థను పూర్తి స్థాయిలో మెరుగుపరుచుకుని మారేడ్‌పల్లి డబుల్ బెడ్‌రూం ప్రాంగణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 మోడల్ కాలనీగా తీర్చిదిద్దుదాం”* అని ఎమ్మెల్యే శ్రీగణేష్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ డీసీ డాకూ నాయక్, ఏఈ వరుణ్ దేవ్, పీవో సుధాకర్, ఎమ్మార్వో అసదుల్లా ఖాన్, ఇతర అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేష్ యాదవ్, వైష్ణవి యాదవ్, సంతోష్ యాదవ్, గణేష్ టెంపుల్ ఛైర్మన్ ప్రభాకర్ యాదవ్, శ్యాం సుందర్ రెడ్డి, పిట్ల నగేష్ ముదిరాజ్. శంకర్ తదితరులు పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper