డాకూర్‌లో తేనీటి విందుకు హాజరైన బిఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు.
సాక్షి డిజిటల్ న్యూస్ జులై 13 (ప్రతినిధి జెల్ల భాగయ్య) నారాయణఖేడ్‌లో నిర్వహించిన ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్షవ్ రివిజన్ ) సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు, అనంతరం అందోల్‌కు తిరిగి ప్రయాణంలో డాకూర్ గ్రామంలోని మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మంజుల జైపాల్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన తేనీటి విందుకు హాజరయ్యారు.ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుకు మంజుల జైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై నాయకులతో ఆయన ఆత్మీయంగా చర్చించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్, నారాయణ, లింగాగౌడ్, చాపల వెంకటేశం, శంకరయ్య, సాయిలు, రఫీక్, రొయ్యల సత్యం, శేఖర్, దుర్గేష్, పరిపూర్ణం తదితరులు పాల్గొన్నారు.