యస్. ఐ. ఆర్.పేరుతో విపక్ష పార్టీల ఓట్లు తొలగించే కుట్ర.
రాష్ట్రంలో దేశంలో ఎస్ ఐ ఆర్ ను అడ్డం పెట్టుకొని విపక్ష పార్టీల ఓట్లు తొలగించే కుట్ర జరుగుతుందని ప్రస్ఫుటంగా కళ్ళకు కనబడుతోంది కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి ప్రభుత్వం బిజెపికి మద్దతు పలుకుతున్న కూటమి పార్టీలు, గెలుపే ధ్యేయంగా ఏం చేసైనా సరే అధికారాన్ని దక్కించుకోవాలనే నెపంతో దుర్మార్గంగా ఓట్లను తొలగించే కుట్ర జరుగుతోంది.పశ్చిమ బెంగాల్లో 65 లక్షల ఓట్లు, కర్ణాటకలో 45 లక్షల ఓట్లు తమిళనాడులో 50 లక్షల ఓట్లు గల్లంతయ్యాయి. ప్రభుత్వ నివేదిక ప్రకారం ఎస్ఐఆర్ చేసినటువంటి రాష్ట్రాల్లో మొత్తం 6 కోట్ల ఓట్లు గల్లంతయినయి.97 కోట్ల ఓటర్లు ఉన్న దేశంలో కేవలం నెల రోజులు సమయం ఇచ్చి ఎస్ ఐ ఆర్, పూర్తి చేయాలని కండిషన్ పెట్టడం చాలా దుర్మార్గం. సమాజంలో అమాయకులు నిరక్షరాస్యులు రోగగ్రస్తులు, పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళినవారు, దిక్కు మొక్కు లేని ఒంటరి మహిళలు వృద్దులు, అభాగ్యులయిన వీరు నెల రోజుల్లో యస్ ఐ ఆర్,కి కావలసిన పత్రాలు రుజువులు ఎలా సమకూర్చుకోగలుగుతారో ఎన్నికల కమిషన్ మరియు పాలకులు జవాబు చెప్పాల్సిన అవసరము న్నది. ఇంత జరుగుచున్న రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూ ఉండడం అనుమానాలకు తావిస్తున్నది. దేశంలో ఎన్నికల సంఘం మీద ప్రజల్లో గందరగోళం అనుమానం కలుగుతున్నది ప్రజల్లో వ్యతిరేకత రాక ముందే ఎన్నికల కమిషన్ సరియైనటువంటి దృక్పథంతో ఎస్ఐఆర్ను సరిగా అమలు చేసి ఇంకో నెల రోజులు యస్ ఐ ఆర్ చేసుకొనుటకు సమయం ఇచ్చి నిజాయితీతో దేశంలోని ప్రతి ఒక్క పౌరుడు పౌరురాలికి ఓటు హక్కు వచ్చే విధంగా చేయాలని డిమాండ్ చేస్తున్నాము.*కాంగ్రెస్ పార్టీ, *వైస్సార్సీపీ, నాయకులు పాల్గొని తహసీల్దారు కు వినతి పత్రం అందించారు ఈ కార్యక్రమం లో జమీల్, యూనస్, అమానుల్లా, సమీవుల్లా, సుహెబ్ ఖాన్, సద్రుల్లా,ఫైరోజ్ తిప్పే రుద్రయ్య, ముబారక్,ముజ్జు, మొదలగు వారు పాల్గొన్నారు.