విద్య తోనే భవిష్యత్తు : జిల్లా ఎస్పీ నాయకత్వ లక్షణాలు పెంపొందాలి
సాక్షి డిజిటల్ న్యూస్ రిపోర్టార్ మెదక్ జిల్లా రిపోర్టార్ దుర్గేష్ గౌడ్ పాపన్నపేట, జూన్ 6 న్యూస్ :విద్యతోనే ఉన్నత భవిష్యత్తు ఉంటుందని జిల్లా ఎస్పీ డీవీ శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం పాపన్నపేట లోని ఓ ఫంక్షన్ హాల్ లో పోలీస్ శాఖ,ఉమెన్ సేఫ్టీ వింగ్,మై ఛాయిస్ ఫౌండేషన్, యంగిస్థాన్ స్వచ్చంద సంస్థల ఆధ్వర్యంలో బాలపంచాయతీ (చిల్డ్రన్ పార్లమెంట్ ) కార్యక్రమం నిర్వహించారు. పాపన్న పేట జడ్పీ ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్య, బాల్య వివాహాలు,బాల్య కార్మిక వ్యవస్థ నిర్మూలన, పారిశుద్ధ్యం, త్రాగునీరు బాలల రక్షణ అంశాల పై చర్చించారు. విద్యార్థుల్లో ప్రశ్నించే నాయకత్వ లక్షణాలు పెంపొందించాలని అధికారులకు జిల్లా ఎస్పీ,అదనపు కలెక్టర్ సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్,డిఎస్పీ ప్రసన్నకుమార్, తహశీల్దార్ సతీష్ కుమార్, ఎంపీడీఓ విష్ణువర్ధన్, సీఐ లు జార్జి,రాజశేఖర్,ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్, ఎంఈవో ప్రతాప రెడ్డి,పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్,డీసీపిఓ నాగరాజు,యంగిస్తాన్ ఫౌండేషన్ ప్రతినిధి వృత్తిక,సర్పంచ్ పావని నరేందర్ గౌడ్,గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.