నరేంద్ర మోడీ నిరంకుశ పాలన నశించాలి అంటూ కాంగ్రెస్ పార్టీ,వైస్సార్సీపీ,యన్ ఎస్ యూ ఐ, సంయుక్తంగా హిందూపురంలో ధర్నా నిర్వహించారు,

July 22, 2026 | తెలంగాణ

ఈ ధర్నాలో ముఖ్య అతిథులుగా అమానుల్లా, శ్యామ్ కిరణ్ జమీల్ మాట్లాడుతూ విద్యార్థులను లాఠీలతో ఆలోచనలను కొట్టలేవు…అరెస్టులతో ప్రజాస్వామ్యాన్ని బంధించలేవురక్తపు చుక్కలను కార్చవచ్చు కానీ న్యాయం కోసం లేచిన స్వరాన్ని ఆపలేవు!యువత భవిష్యత్తు కోసం నిలబడిన అడుగులను అడ్డుకునే ప్రతి ప్రయత్నంచరిత్రలో నియంతృత్వానికి మరో నల్ల పుట మాత్రమే.ఒక విద్యార్థి కన్నీటి చుక్క దేశ భవిష్యత్తు ప్రశ్నఒక యువకుడి గాయమైన నుదురు ప్రజాస్వామ్యానికి పరీక్ష.ఆ ప్రశ్నకు లాఠీ సమాధానం కాదు న్యాయం మాత్రమే సమాధానం.సత్యాన్ని ప్రశ్నించే గొంతుకలను నొక్కివేస్తే…ఆ గొంతులే రేపటి ప్రజా తుఫానుగా మారతాయి.అణచివేత ఎంత పెరిగితే… ప్రతిఘటన అంత బలపడుతుంది.ఈ దేశం భయానికి కాదు…త్యాగాలకు పుట్టినిల్లు.ఈ నేలపై స్వాతంత్ర్యం కోసం రక్తం చిందిందిప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి ఎన్నో కుటుంబాలు మూల్యం చెల్లించాయి.అధికారం శాశ్వతం కాదు…ప్రజల తీర్పే శాశ్వతం.కుర్చీలు మారుతాయి. కానీ చరిత్ర తీర్పు ఎప్పటికీ మారదు.విద్యార్థుల న్యాయం కోసం, యువత భవిష్యత్తు కోసం, రాజ్యాంగ పరిరక్షణ కోసం, ప్రజాస్వామ్య విలువల కోసం నిలిచే ప్రతి అడుగు… భారత ఆత్మను మరింత బలపరుస్తుంది.ప్రజల గొంతును వినండి…ప్రశ్నలను అణచివేయకండి…ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి. బాధ్యులైన కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చాయాలని, మరియు చనిపోయిన విద్యార్థులకు ఒక్క కోటి ప్రకారం ఆర్థిక సాయం అందించి కుటుంబానికి ఒక ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అమానుల్లా వైస్సార్సీపీ కార్యదర్శి.శ్యాంకిరణ్ కాంగ్రెస్ నాయకులు, జమీల్, సుహెబ్ ఖాన్, సమీవుల్లా, తిరుపాల్ పాల్గొన్నారు.

🌐 Select Language:
📰 ePaper