September 22, 2026
Breaking News

తెలంగాణ

1950 రాష్ట్రపతి ఉత్తర్వులో 3వ పేరా రద్దు చేయాలి.. దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరమ్ డిమాండ్

*బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో గద్దర్‌కు నివాళులర్పించి హక్కుల సాధనపై చర్చ

సాక్షి డిజిటల్ న్యూస్ ఆగష్టు 7, 2026మేడ్చల్ మల్కాజ్గిరి రిపోర్టర్ చంద్రశేఖర్ఉప్పల్ నియోజకవర్గం నాచారంలోని బహుజన సాహిత్య అకాడమీ కార్యాలయంలో ప్రజాకవి గద్దర్ 3వ వర్ధంతి సందర్భంగా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ఫోరమ్ ఆధ్వర్యంలో నివాళులర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో దళిత క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లు కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఫోరమ్ అధ్యక్షుడు బుచ్చిగారి భాస్కర్ మాట్లాడుతూ, 1950 రాష్ట్రపతి ఉత్తర్వులోని మూడో పేరాను తొలగించి దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరారు. మతం మారినా కుల వివక్ష అంతం కాలేదని, దళిత క్రైస్తవులకు రాజ్యాంగబద్ధ హక్కులు అందే వరకు ఉద్యమం కొనసాగుతుందని నాయకులు స్పష్టం చేశారు. త్వరలో ఉప్పల్ నియోజకవర్గ స్థాయిలో భారీ బహిరంగ సభ నిర్వహించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ చీఫ్ బిషప్ విల్సన్ సింగం, నల్లా రాధాకృష్ణతో పాటు పలువురు బిషప్‌లు, పాస్టర్లు, క్రైస్తవ, కాంగ్రెస్ నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

📰 ePaper