ఎంఆర్వో కార్యాలయంపై రసాభాసగా గ్రామసభ

July 24, 2026 | తెలంగాణ

సాక్షి డిజిటల్ డివిజన్ గద్వాల్, జులై, 23, రాజోలి మండలం న్యూస్,రాజోలి: రాజోలి మండల కేంద్రంలో కొత్త ఎంఆర్వో కార్యాలయ నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసింది. కార్యాలయాన్ని కొత్త రాజోలిలో నిర్మించాలా, పాత రాజోలిలో నిర్మించాలా అనే అంశంపై ప్రజల అభిప్రాయం తెలుసుకునేందుకు గురువారం గ్రామసభ నిర్వహించారు. అయితే ఇరు గ్రామాల ప్రజలు తమ తమ వాదనలు వినిపిస్తూ వాగ్వాదానికి దిగడంతో సమావేశం రసాభాసగా మారింది. దీంతో అధికారులకు ప్రజాభిప్రాయం సేకరించడం సాధ్యంకాక, గ్రామసభను ముగించారు.

🌐 Select Language:
📰 ePaper