ప్రజాస్వామ్యం, లౌకికవాదం రాజ్యాంగం గెలిచింది.
విద్యార్థుల విజయం ప్రజాస్వామ్యానికి చారిత్రాత్మక విజయంతలొంచని విద్యార్థి సంకల్పం.గెలిచిన న్యాయం గెలిచింది ప్రజాస్వామ్యం నిలిచింది.కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పరీక్షల వ్యవస్థలో పారదర్శకత కోసం, విద్యార్థుల న్యాయం కోసం శాంతియుతంగా పోరాడిన ప్రతి విద్యార్థికి నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు.ఈ ఉద్యమంలో ధైర్యంగా స్వరం వినిపించిన విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఉపాధ్యాయులు, సామాజిక సంస్థలు, ప్రజాస్వామ్యవాదులు, అలాగే ప్రతి దశలో విద్యార్థులకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలుఈ పోరాటానికి బలమైన రాజకీయ మద్దతు అందిస్తూ, పార్లమెంట్ నుంచి ప్రజా ఉద్యమాల వరకు విద్యార్థుల తరఫున నిరంతరం గళమెత్తిన ప్రజలకు దేశవ్యాప్తంగా ఉద్యమించిన విద్యార్థులకు మద్దతు ఇచ్చిన ప్రతిపక్ష పార్టీలకు హృదయపూర్వక కృతజ్ఞతలు.ఇది ఎవరి ఓటమి కాదు… న్యాయం సాధించిన విద్యార్థుల విజయం.ఇది ఎవరి రాజకీయ గెలుపు కాదు… ప్రజాస్వామ్యం సాధించిన విజయం.ఇకపై కూడా పరీక్షల నిర్వహణలో పూర్తి పారదర్శకత, పేపర్ లీక్‌లకు శాశ్వత అడ్డుకట్ట, బాధ్యులపై కఠిన చర్యలు, విద్యార్థుల భవిష్యత్తును రక్షించే సమగ్ర సంస్కరణలను కేంద్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం.విద్యార్థి స్వరం వినిపిస్తే ప్రజాస్వామ్యం బలపడుతుంది.”ప్రశ్నించిన యువతే దేశ భవిష్యత్తును కాపాడుతుంది.”న్యాయం కోసం పోరాటం ఎప్పుడూ వృథా కాదు.” అమానుల్లా *వైస్సార్సీపీ ఏపీ స్టేట్ మైనారిటీ వింగ్ కార్యదర్శి